హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

MDCL: బోడుప్పల్‌లోని నిమిషాంబికా దేవి ఆలయంలో వరలక్ష్మీ పర్వదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణకవచాలతో అలంకరించి విశేష పూజలు, అర్చనలు చేశారు. మహిళల ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.