హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాక్టర్లు చేపడుతున్న ఆందోళనకు మద్ధతు

ASR: జూనియర్‌ డాక్టర్లు చేపడుతున్న ఆందోళనకు సీఐటీయూ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జూనియర్‌ డాక్టర్ల స్టయిఫండ్‌ 30శాతం పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు శుక్రవారం పాడేరులో డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతోనే ఆందోళనకు దిగారని తెలిపారు.