హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుస చోరీల నిందితుడి అరెస్ట్

NGKL: ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న శాయిన్ పల్లికి చెందిన కసరి శివకుమార్‌ను అరెస్ట్ చేసినట్లు నాగర్‌కర్నూల్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. అతడి నుంచి 25.1 తులాల బంగారం, 182 తులాల వెండి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు ఛేదించడంలో పనిచేసిన ఎస్సై శంషోద్దీన్ , పీసీ భీముడు, హెచ్‌సీ రమేష్, శివలను సీఐ అభినందించారు.