హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి దీపాలు వెలగక అవస్థలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారుల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోడ నరసింహ అన్నారు. హైమాస్ట్ లైట్లు సైతం పనిచేయక రాత్రివేళల్లో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే వీధి దీపాలను రిపేర్ చేయాలన్నారు.