హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రైస్ మిల్లర్లకు కీలక ఆదేశాలు

MDK: జిల్లాలోని 54 మంది రైస్ మిల్లర్లకు అధికారులు గట్టి షాకిచ్చారు. ప్రభుత్వానికి బకాయిపడ్డ రూ.128.02 కోట్లను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా 50 శాతం, సెప్టెంబర్‌లో 25 శాతం, అక్టోబర్‌లో మరో 25 శాతం చొప్పున మూడు విడతల్లో బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.