హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీల నిందితుడి అరెస్టు

MDK: తూప్రాన్ పట్టణంలో షెట్టర్లు తొలగించి చోరీలకు పాల్పడిన కందుల సత్యనారాయణను అరెస్ట్ చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న విశాఖపట్నానికి చెందిన సత్యనారాయణ ఫర్టిలైజర్, చెప్పుల దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డాడని చెప్పారు. నల్గొండ పోలీసులు చోరీ కేసులో అరెస్ట్ చేయగా, కోర్టు అనుమతితో తూప్రాన్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.