హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రక్తదానంతో ప్రాణదాతలు కండి'

VZM: జిల్లా హోటల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్పీ దామోదర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర ప్రసవ సమయాల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో అందించేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.