హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్

ADB: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగి వద్ద నుంచి రూ.99 వేలు తీసుకుని మోసానికి పాల్పడిన వ్యక్తి గోలి మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ రహీం పాషా శుక్రవారం తెలిపారు. తలమడుగు మండలానికి చెందిన బాధితుడు వెంకటేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలు చేసే దళారులను నమ్మవద్దని CI హెచ్చరించారు.