హైదరాబాద్: 28°C
తెలంగాణ

WGL: ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు

WGL: ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుతో పాటు సుమారు 50 మంది కార్యకర్తలపై కేసు నమోదైంది. వర్ధన్నపేట పట్టణంలోఅంబేద్కర్‌ సెంటర్‌లో గురువారం అనుమతులు లేకుండా రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ బొడ్డుపెల్లి శ్రీకాంత్‌ శుక్రవారం స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి రసీదు అందజేశారు.