BDK: కొత్తగూడెంలోని సుభాష్ చంద్రబోస్ నగర్ వద్ద గోధుమ వాగు బ్రిడ్జిపై ఏర్పడిన భారీ గుంతకు శుక్రవారం అధికారులు మరమ్మతులు చేపట్టారు. శుక్రవారం ఉదయం గుంత ఏర్పడటంతో పోలీసులు అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. నూతన బ్రిడ్జిపైనే గుంత ఏర్పడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్మాణ నాణ్యతపై సమగ్ర పరిశీలన చేయాలని కోరారు.
తెలంగాణ
గోధుమ వాగు బ్రిడ్జిపై గుంతకు మరమ్మతులు


