హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలంలో విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో విద్యుత్‌ షాక్‌తో షేక్‌. రహిమాన్‌ (54) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలం సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద నుంచి వెళ్తుండగా ఎర్త్‌ వైర్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.