ATP: నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి ఎమ్మెల్యే పరిటాల సునీత వెళ్లారు. ఇటీవల బండ్ల కుమార్తె పెళ్లి జరగడంతో.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుమార్తె జనని, అల్లుడు సూర్య తేజలకు ధర్మవరం పట్టు వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. పరిటాల రవితో ఉన్న పాత అనుబంధాన్ని బండ్ల గణేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బండ్ల గణేష్ నివాసంలో ఎమ్మెల్యే పరిటాల


