హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్‌ షాపులు మూసివేయాలని వినతి

JN: వెల్ది గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులను వెంటనే మూసివేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ పాలకవర్గం రఘునాథపల్లి తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సైలకు వినతిపత్రం అందజేశారు. బెల్ట్‌ షాపుల వల్ల మద్యం వినియోగం పెరిగి ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు బెల్ట్‌ షాపులను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.