GDWL: ధరూర్ నెట్టెంపాడు కెనాల్ సమీపంలో అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. చాలా రోజుల నుంచి ఇలానే గుంతలలో ప్రయాణం చేసి ప్రయాణికులు అలసిపోయారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న దీనిని పట్టించుకునే నాధుడే లేడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: రహదారిపై భారీగా గుంతలు


