GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని మున్సిపల్ డంపింగ్ యార్డును మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. కమిషనర్ రామ అప్పలనాయుడుతో కలిసి యార్డును పరిశీలించారు. గతంలో పేరుకుపోయిన భారీ వ్యర్థాలను పూర్తిగా తరలించి యార్డును పరిశుభ్రంగా ఉంచడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. యార్డులోని ఇతర యూనిట్లను పరిశీలించి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నాదెండ్ల


