SRD: నానో యూరియాతో రైతులకు అధిక దిగుబడి వస్తుందని కంగ్టి ఏవో హరీష్ పవార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నానో యూరియాను వాడితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారన్నారు. దిగుబడి ఎక్కువగా వస్తుందన్నారు. ప్రస్తుతం వరి సాగు పిలకల దశలో ఉందని ఈ దశలోనే నానో యూరియాను పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
తెలంగాణ
నానో యూరియాతో అధిక దిగుబడి: ఏవో


