హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధుల హక్కులపై న్యాయ అవగాహన

PDPL: గోదావరిఖని సమీపంలోని వీర్లపల్లి ఈశ్వరకృప వృద్ధుల ఆశ్రమంలో శుక్రవారం మండల న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి నల్లాల వెంకట్ సచిన్రెడ్డి మాట్లాడుతూ.. వృద్ధులకు చట్టపరంగా అనేక హక్కులు ఉన్నాయని తెలిపారు. పిల్లలు వృద్ధాప్యంలో పట్టించుకోకపోతే ఇచ్చిన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉందని వివరించారు.