హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంతోనే మాట్లాడతా: కొండా సురేఖ

HYD: కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై షోకాజ్‌ నోటీసుల విషయంలో కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీకి తాను చెప్పాల్సింది చెప్పానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రస్తుతం మీడియాతో మాట్లాడబోనని ఆమె పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనతోనే నేరుగా మాట్లాడనున్నట్లు ఆమె తెలిపారు.