హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ వివాదంపై పోలీసుల చర్చ

KDP: ముద్దనూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చింతకుంట గ్రామాన్ని సందర్శించారు. రైతుల మధ్య ఉన్న భూ వివాదంపై సంబంధితులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణం కొనసాగించాలని గ్రామస్థులకు సూచించారు. సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు.