ASR: అనంతగిరి మండలంలోని జీనబాడు, పినకోటలో పరిధిలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. టీడీపీ మండల కార్యదర్శి గాలి నరేంద్ర ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు. రహదారి, పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనంతగిరిలో పర్యటించిన ఛైర్మన్


