ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జెల్లేపల్లి హాస్టల్‌ను ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను పరిశీలించారు. దుస్తులు, షూస్, కాస్మోటిక్ ఛార్జీలు అందించాలని విద్యార్థులు కోరగా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీడీవో హామీ ఇచ్చారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీడీవో


