MLG: వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ములుగు మండలం మదనపల్లిలో గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెత్తిన నీళ్ల బిందెలతో డప్పు చప్పుళ్ల నడుమ పోచమ్మ, హనుమాన్, వెంకటేశ్వరస్వామి ఆలయాలకు చేరుకుని జలాభిషేకాలు చేశారు. వర్షాభావంతో వరి పైరు ఎండిపోతోందని, వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని వేడుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
వానల కోసం గ్రామదేవతలకు జలాభిషేకం


