AKP: దేవరాపల్లి మండలం కాశీపురం-గవరవరం ప్రధాన రహదారి పనులు నెలలుగా అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కలిగొట్ల వద్ద శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ.. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అసంపూర్తి రహదారి పనులపై నిరసన


