హైదరాబాద్: 28°C
వార్తలు

'మెగా డీఎస్సీపై ఆరోపణలు అర్థరహితం'

NTR: మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు లేనివని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియని వారు పరీక్ష విధానాలపై మాట్లాడటం విడ్డూరమన్నారు. గొల్లపూడి కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామని తెలిపారు.