హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాకి రానున్న మంత్రి

VSP: మంత్రి నారా లోకేష్ శనివారం విశాఖ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు మధురవాడలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. విశాఖ కార్యక్రమం అనంతరం విజయనగరం జిల్లాకు వెళ్లి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 1:30 నుంచి జరిగే హెచ్‌ఆర్‌డీ క్లస్టర్ మీట్‌లో పాల్గొంటారు.