హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీర్ణ ఉద్ధరణ పనుల ఆలస్యంపై VHP ఆగ్రహం

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి జీర్ణ ఉద్ధరణ పనుల ఆలస్యంపై విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరెడ్లపల్లి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లు గడిచిన ఆలయంలో పనులు నత్తనడకన సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆలయం చుట్టూ పందులు, మేకలు తిరుగుతూ భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.