హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రిక్స్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం

VZM: భోగాపురం విమానాశ్రయంలో బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు తెలుగు సంప్రదాయ రీతిలో శుక్రవారం ఘన స్వాగతం పలికారు. మేళతాళాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, ఇండోనేషియా, ఇరాన్‌, యూఏఈ, ఇథియోపియా, బ్రెజిల్‌ దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారు.