హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దావాఖాన, మహిళా సంఘం భవనం, అంగన్వాడీ కేంద్రాలను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఆర్డిఓ రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.