NTR: విజయవాడ రైల్వే స్టేషన్‌లో చోరీల భయంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. స్టేషన్‌లోకి అనధికారికంగా ప్రవేశించే మార్గాలు సుమారు 12 ఉన్నట్లు సమాచారం. దీంతో బయట వ్యక్తులు సులభంగా లోపలికి వస్తున్నారని చెబుతున్నారు. 10 ప్లాట్‌ఫామ్‌లకు సరిపడా ఆర్‌పీఎఫ్ సిబ్బంది లేకపోవడంతో నిఘా కష్టంగా మారిందని, సెల్‌ఫోన్లు, బ్యాగులు, బంగారు ఆభరణాలు చోరీకి గురవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే స్టేషన్‌లో దొంగల భయం


