హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పరిటాల

సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామంలోని వడ్డవీధిలో వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.