హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో వీడని హత్య మిస్టరీ

PLD: వినుకొండ కల్యాణపురి కాలనీలో పుష్పలత హత్య కేసుకు సంబంధించి నేటికి ఏడాది పూర్తయినా నిందితుని ఆచూకీ లభించలేదు. గతేడాది ఆగస్టు 21న ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటనపై ఏడాది గడుస్తున్నా హంతకులను పట్టుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.