హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళపై అత్యాచారం ఆరోపణలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (M) మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని, సిమెంట్ బస్తాలు ఇస్తానని చెప్పి ఓ మహిళను ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడని పుల్లాయగూడెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మాలి శంకర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.