NGKL: తాడూరు మండలంలోని పలు గ్రామాలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (KLI) ద్వారా అందాల్సిన సాగునీరు నిలిచిపోయింది. చర్ల ఇటిక్యాల శివారులోని D-26 కాల్వకు కొందరు అడ్డుగా నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహం ఆగిపోయిందని రైతులు తెలిపారు. దీంతో తాడూరు, గుంతకోడూరు, అల్లాపూర్, తాళ్లపల్లి, నడిగడ్డ, రఘుపతిపేట తదితర గ్రామాలకు సాగునీరు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
కాల్వకు అడ్డుగా నిర్మాణాలు..


