KNR: జమ్మికుంట మండలం గండ్రపల్లి సమీపంలో ట్రాలీలో హింసాత్మకంగా తరలిస్తున్న 20 గోవులను జమ్మికుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్సై రవి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి జంతు హింస నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు. 10 ఆవులు, ఐదు లేగదూడలు, ఐదు మగదూడలను సుల్తానాబాద్‌లోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలకు తరలించారు.
తెలంగాణ
VIDEO: ట్రాలీలో తరలిస్తున్న 20 గోవులు స్వాధీనం


