హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరకట్న వేధింపుల కేసులో జైలు శిక్ష

NLG: రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన వరకట్న వేధింపులు, కుల దూషణ కేసులో నలుగురికి ప్రత్యేక సెషన్స్‌ కోర్టు శిక్ష విధించింది. నిందితులు కల్లూరి స్వామినాథ్, ప్రమీల, యాదయ్య, ఎల్లయ్యలకు మూడు సెక్షన్ల కింద 6 నెలల చొప్పున జైలు, రూ.3 వేల చొప్పున జరిమానా విధించింది. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఆదేశించడంతో నిందితులు 6 నెలల జైలు శిక్ష అనుభవించనున్నారు.