హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఈటీలకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు: డీఈవో

SRD: పాఠశాల, శారీరక విద్యా ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు చేపట్టనున్నట్లు DEO రోహిణి తెలిపారు. సంగారెడ్డి, కంది, కొండాపూర్ మండలాల పీఈటీలు, పీడీలు ఈ శిక్షణకు హాజరుకావాలని ఆదేశించారు. విద్యార్థుల్లో క్రీడాసక్తిని, ఫిట్‌నెస్‌ను పెంచడంలో పీడీల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయులను సదస్సుకు పంపేలా హెచ్‌ఎంలు సహకరించాలని డీఈవో విజ్ఞప్తి చేశారు.