WNP: వీపనగండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడిపిన కల్వరాల గ్రామానికి చెందిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష పడింది. వనపర్తి ఫస్ట్ అడిషనల్ న్యాయమూర్తి శ్రీలత ఈ తీర్పునిచ్చినట్లు కోర్టు కానిస్టేబుల్ రాజేందర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నరేశ్ కుమార్ హెచ్చరించారు.
తెలంగాణ
డ్రంకన్ డ్రైవ్.. వ్యక్తికి జైలు శిక్ష!


