హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడాకారిణికి జిల్లా స్థాయిలో రెండో స్థానం

MDK, జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రామాయంపేటకు చెందిన వరగంటి నేహా శ్రీ రజత పతకం సాధించింది. అండర్-16 బాలికల షాట్‌పుట్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని నేహా శ్రీని పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమెను ఆశీర్వదించారు.