హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌లోనే ఘర్షణ..!

WGL: GWMCలోని గిరి ప్రసాద్ నగర్‌లో గృహ ప్రవేశం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు ఇరువర్గాలను పిలిపించారు. అక్కడ మాటామాటా పెరిగి పరస్పరం దాడి చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు సమాచారం.