KDP: లింగాల మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, కీలక కేసుల ఛేదన, పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై జగదీశ్వరరెడ్డిని ఎస్పీ నచికేత్ ప్రశంసాపత్రంతో సత్కరించారు. నేరాల నియంత్రణలో చొరవ చూపినందుకు ఈ గుర్తింపు లభించింది. ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరింత బాధ్యతతో పనిచేస్తానని జగదీశ్వరరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎస్సై జగదీశ్వరరెడ్డికి ఎస్పీ ప్రశంసాపత్రం'


