హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి క్రీడలకు చిన్నతిప్పసముద్రం విద్యార్థులు

అన్నమయ్య: మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. బాస్కెట్‌బాల్ అండర్-17 బాలికల విభాగంలో ముగ్గురు, హాకీ బాలికల విభాగంలో నలుగురు, బాలుర విభాగంలో నలుగురు ఎంపికయ్యారు. ఆగస్టు 24 నుంచి 27 వరకు తిరుపతిలో జరిగే పోటీల్లో రాణించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.