హైదరాబాద్: 28°C
క్రీడలు

కుల్దీప్ ఓ మ్యాచ్ విన్నర్: స్పిన్ కోచ్

శ్రీలంకతో తొలి టెస్టులో విఫలమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కొందరు విమర్శలు చేస్తున్నారు. అతడిని రెండో టెస్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కుల్దీప్‌కు భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మద్దతుగా నిలిచాడు. కుల్దీప్ ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన విమర్శలు చేయడం సరికాదన్నాడు. అతడు ఓ మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు.