హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దపల్లి డీపీఆర్వోగా బి.తిరుమల బాధ్యతలు

PDPL: జిల్లా పౌర సంబంధాల అధికారిగా (డీపీఆర్వో) బి.తిరుమలను నియమిస్తూ ప్రత్యేక కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. శాఖ అధికారులతో సమావేశమై మీడియా సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంపై సమీక్షించారు.