హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలి'

ADB: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై హైదరాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, మేధావులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీసీఐ మూతపడటంతో వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.