హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్‌లో 3,188 అడ్మిషన్లు: వెంకటస్వామి

SRD: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్‌లో ఇప్పటివరకు 3,188 అడ్మిషన్లు నమోదైనట్లు కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఈ నెల 31 వరకు ప్రవేశాలకు అవకాశముందన్నారు. మధ్యలో చదువు నిలిపివేసిన వారు నేరుగా ప్రవేశం పొందవచ్చని సూచించారు. అడ్మిషన్ల ఫీజును మీసేవా కేంద్రాల్లోనే చెల్లించాలని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.