హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్

GDWL: ధరూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.