SRD: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన పురస్కరించుకుని ఈనెల 22న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు లడ్డు తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే శిబిరంలో అభిమానులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ
రక్తదాన శిబిరం కరపత్రాల ఆవిష్కరణ


