హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

SRPT: జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఈరోజు కలెక్టర్ తేజస్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసినవారు లేదా చదువు ఆపిన వారు అర్హులు. 3 నుంచి 6 నెలల పాటు ఉచిత వసతి, భోజనంతో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తారు. ఆసక్తిగలవారు ఆగస్టు 25లోపు కోదాడ, సూర్యాపేట వసతి గృహాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.