ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్టేషన్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. రూ.34 కోట్లతో చేపట్టిన పనులు మూడేళ్ల నుంచి జరుగుతున్నాయని, 3 నెలల్లో పూర్తి చేయకపోతే స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
పనులు పూర్తి కాకుంటే రైల్వే స్టేషన్ ముట్టడిస్తాం: CPM


