హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ జాబితా నుంచి భూములను తొలగించాలి: తిప్పన్న

NRPT: కృష్ణా మండలం హిందూపూర్ గ్రామంలో 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను వెంటనే తొలగించాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఉప్పరి తిప్పన్న కోరారు. భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తహసీల్దార్ స్పందించి 22-ఏ జాబితాలో చేర్చిన భూములను పరిశీలించి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.